రుబ్రిక్‌లో రూ. 1.45 కోట్ల వార్షిక వేతనంతో ప్లేస్‌మెంట్ ఆఫర్‌ను అందుకున్న నిడుమోలు లక్ష్మీ నారాయణరావు

Telugu Lo Computer
0


మెరికన్ క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ రుబ్రిక్‌లో రూ. 1.45 కోట్ల వార్షిక వేతనంతో అద్భుతమైన ప్లేస్‌మెంట్ ఆఫర్‌ను నిడుమోలు లక్ష్మీ నారాయణరావు అందుకున్నాడు. తద్వారా కన్న తల్లిదండ్రులకు, కన్న ఊరికి గర్వకారణంగా నిలిచాడు. చదువుకున్న సంస్థకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన నిడుమోలు లక్ష్మీ నారాయణ రావు. తండ్రి వ్యాపారం చేస్తుండగా, తల్లి ప్రభుత్వ ఉద్యోగి. రాంచీలోని మెస్రాలో ఉన్న బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2021-2025 బ్యాచ్‌కు చెందినకంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి. అద్భుతమైన ప్రతిభతో ప్రొఫెసర్లు, కంపెనీలను ఆకట్టుకున్నాడు. తాజాగా ప్రతిష్టాత్మక కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. తన చదువులో భాగంగా లక్ష్మీ నారాయణ రావు అమెరికన్‌ కంపెనీ రుబ్రిక్‌లో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌కోసం చేరారు. అదే అతని జీవితంలో మైలు రాయిగా నిలిచింది. అతని అసాధారణ పనితీరు వారిని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో రూ 1.45 కోట్ల వార్షిక ప్యాకేజీ వెదుక్కుంటూ వచ్చింది. దీంతో మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించాడు. త్వరలోనే బెంగళూరులో తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. రావుకు చిన్నప్పటి నుంచీ ఐటీ, టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కప్ లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడు. బిట్ మెస్రా యాజమాన్యం నిడుమోలు సాధించిన విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేసింది.తమ సంస్థకు చెందిన విద్యార్థికి ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీని అందుకోవడం ఇదే తొలిసారంటూ రావును అభినందించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)