ఐక్యూ నియో 10 ప్రీ-బుకింగ్ చేసినవారికి ఐక్యూ టీడబ్ల్యూఎస్ 1e ఇయర్‌బడ్స్ ఉచితం

Telugu Lo Computer
0


ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్ నియో 10 ని విడుదల చేసింది. నియో 10 సిరీస్‌లో భాగంగా రిలీజ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ నియో 7 తర్వాత మళ్లీ వచ్చిన వనిల్లా మోడల్ గా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, 7,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్‌తో ధూళి, నీటి నిరోధకత, 7,000mm² వేపర్ కూలింగ్ చాంబర్ వంటి అద్భుత ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 8.09mm, బరువు 206 గ్రాములు మాత్రమే ఉండడంతో టెక్ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ప్రత్యేకించి హై-ఎండ్ యూజర్లను లక్ష్యంగా చేసుకున్న మార్కెట్ లోకి వచ్చిన ఈ ఫోన్ టార్గెట్ ని రీచ్ అయ్యిందనే టాక్ నడుస్తోంది. ప్రారంభ సేల్ ఆఫర్ కింద ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ. 2,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇప్పటికే ప్రీ-బుకింగ్ సేల్ ప్రారంభం అవ్వగా.. అమ్మకాలు జూన్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. అమెజాన్, ఐక్యూ ఇండియా స్టోర్ లతో పాటు రిటైల్ మొబైల్ షాప్స్ లో సైతం అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ప్రీ-బుకింగ్ చేసినవారికి ఐక్యూ టీడబ్ల్యూఎస్ 1e ఇయర్‌బడ్స్ ఉచితంగా అందిస్తున్నారు. వేగవంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, కూలింగ్ టెక్నాలజీతో అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ప్రతి టెక్ లవర్‌ను ఆకర్షించేలా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)