ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. దీంతో రాష్ట్రంతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలోనే పరీక్ష కేంద్రాలకు సంబంధించి ఐచ్ఛికాలు స్వీకరించారు. ఎక్కువ మందికి వీటి ప్రకారమే పరీక్ష కేంద్రాలను కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
May 31, 2025
0
Tags