కల్నల్ సోషియాపై కామెంట్స్ చేసిన బీజేపీ మంత్రి విజయ్‌ షా రాజీనామా?

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి విజయ్‌ షా  కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విజయ్‌ షా కామెంట్స్ పై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అతడ్ని ఇంకా ఎందుకు పదవి నుంచి తొలగించడం లేదని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాయి. దీంతో అతడు తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. కాగా, ఈ వ్యవహారంపై మే 28వ తేదీన తుది నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై విచారణకు ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన సిట్ ఆ రోజున తుది నివేదిక సమర్పించనుంది. దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉండొచ్చని భారతీయ జనతా పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)