ధారావి రీడెవలప్‌మెంట్‌ మాస్టర్ ప్లాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం

Telugu Lo Computer
0


సియాలోని అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావిని ఆధునీకరించేందుకు మాస్టర్ ప్లాన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ధారావి పరిరక్షణ, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఆ ప్రణాళిక అమలు చేయనున్నారు. రీడెవలప్మెంట్ ప్రక్రియ నేపథ్యంలో ధారావి సామాజిక, సాంస్కృతిక గుర్తింపునకు ఎటువంటి నష్టం ఉండదని ప్రభుత్వం చెప్పింది. ధారావి పునర్ నిర్మాణం ప్రాజెక్టును నవభారత్ మెగా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు అప్పగించారు. సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలో జరిగిన మీటింగ్‌లో ఈ ప్లాన్‌కు అప్రూవల్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)