కంచ గచ్చిబౌలి వ్యవహారంలో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందే, లేదంటే సీఎస్ తో పాటు ఇతర అధికారులకు జైలు శిక్ష తప్పుదు : సుప్రీంకోర్టు

Telugu Lo Computer
0


ర్యావరణ నష్టాన్ని పూడ్చకపోతే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులకు జైలు శిక్ష తప్పదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చేపట్టిన పనులకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా? అన్న అంశంపై అధికారులను నిలదీసింది. లాంగ్ వీకెండ్‌ దొరికిన వెంటనే పనులు ఎందుకు చేపట్టారని ప్రశ్నించింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందేనని, లేదంటే సీఎస్ తో పాటు ఇతర అధికారులకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై పర్యావరణ నష్టం పూడ్చేందుకు తీసుకునే చర్యల వివరాలను తక్షణమే కోర్టుకు సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమస్యను చిన్నదిగా తీసుకోవద్దని, ప్రజల హక్కులు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)