తిరుమల శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లకు తగ్గిన ఆదరణ ?

Telugu Lo Computer
0


తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. ఈ సారి వేసవి సెలవుల్లో రద్దీ పెరుగుతుందనే అంచనాలతో టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేసారు. బ్రేక్ దర్శనాలను రద్దు చేసారు. జూలై 15వ తేదీ వరకు సిఫారసు లేఖలను అనుమతించమని వెల్లడించారు. అయితే, టీడీపీ అంచనా లు తప్పుతున్నాయి. వేసవి రద్దీ ఆశించిన స్థాయిలో లేదు. దర్శన క్యూ లైన్లు కొన్ని సందర్భాల్లో ఖాళీగా కనిపిస్తున్నాయి. అనూహ్యంగా వారం రోజులుగా శ్రీవాణి దర్శన టికెట్లు సైతం మిగిలి పోవటం ఆశ్చర్యకరంగా మారుతోంది. తిరుమలలో ఈసారి వేసవి సెలవుల్లో భిన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతీ ఏటా వేసవి లో తిరుమల భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ సారి అదే అంచనాలతో టీటీడీ ముందస్తు చర్యలను చేపట్టింది. వీఐపీ లేఖలను రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకే బ్రేక్ దర్శనాలను పరిమితం చేసింది. అటు ఆపరేషన్ సింధూర్ తో అంచనాలు తారు మారు అయ్యాయి. ప్రతీ వేసవిలోనూ దర్శనా నికి భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు క్యూ లైన్లు కిలో మీటర్ల మేర వ్యాపిస్తాయి. ఈ ఏడాది మాత్రం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గతేడాది ఎన్నికల నేపథ్యంలో మే 1 నుంచి 10వ తేదీ వరకు 7,04,760 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, ఈ సారి కూడా అదే సంఖ్యలో 7,04,689 మంది శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు ఆన్ లైన్ తో పాటుగా ఆఫ్ లైన్ లో భక్తులు పోటీ పడి మరీ దక్కించుకుంటారు. నిమిషాల వ్యవధిలో టికెట్లు పూర్తి అవుతాయి. అయితే, తాజాగా తిరుమల శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లకు ఆదరణ తగ్గినట్లు కనిపిస్తోంది. వారం రోజులుగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు భారీగా మిగిలిపోతున్నట్లు తెలుస్తోంది. గడచిన ఆరు రోజుల్లో ఏకంగా 4,113 టికెట్లు మిగిలిపోయాయి. కాగా టీటీడీ రోజుకు 1500 శ్రీవాణి ట్రస్ట్‌ దర్శన టికెట్లు కేటాయిస్తోంది. వేసవి లో శ్రీవాణి టికెట్ల కోసం రద్దీ ఎక్కువగా ఉండేది. ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అదే సమయంలో తిరుమలలో సాధారణ రద్దీ కొనసాగుతుండటంతో దర్శనం సైతం త్వరగానే అందు తోందని భక్తులు చెబుతున్నారు. ఈ ఏడాది వేసవి సెలవుల్లో రద్దీ పెరగకుండా సాధారణంగానే ఉండటానికి ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలే కారణంగా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది వేసవికి రద్దీ విపరీతంగా ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేసినప్పటికీ ఉద్రిక్తతల నేపథ్యంలో సాధారణ రద్దీ నెలకొంది. ఈ నెలలో 1, 2 తేదీలు మినహా ఏ రోజూ కంపార్టు మెంట్లు పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో కేవలం 7 నుంచి 12 గంటల్లోపే భక్తులు శ్రీవారిని దర్శించుకుని తిరుమల పర్యటన పూర్తి చేసుకుంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)