ఆంధ్రప్రదేశ్ లోని నూజివీడులో బర్త్‌డే ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్ళిన ఆరుగురు స్నేహితులు నూజివీడు నుంచి ఆటోలో తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న ఆటోను వెంకటాద్రిపురం వద్ద లారీ బలంగా ఢీ కొట్టింది. దీంతో హనుమంతులగూడెంకు చెందిన మంతెన అజయ్‌కుమార్ (28) లారీ చక్రాల కింద పడి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరో ఐదుగురు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడిన యువకులను నూజివీడు ఏరియాఆసుపత్రికి తరలించారు. కాగా గాయపడిన యువకులు శ్రీనివాస్, సాయికిరణ్, ఇమ్రాన్, పవన్, ప్రశాంత్‌లుగా గుర్తించారు.
నూజివీడులో ఆటోను లారీ ఢీకొని ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
May 18, 2025
0
Tags