బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు, రేపు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి జల్లులు, మరికొన్ని ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కాగా నేడు రాష్ట్రంలోని అనేక జిల్లాలలో పలు ప్రాంతాలలో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు !
May 19, 2025
0
Tags