హైదరాబాద్ నగరం మిస్ వరల్డ్ అందాల పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. మే 31న 72వ ఎడిషన్ ఫైనల్స్ ఇక్కడ జరగనున్నాయి. విశ్వ సుందరీ పోటీల ద్వారా తెలంగాణ పర్యాటకాన్ని ప్రపంచానికి చూపించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ మెగా ఈవెంట్ కు ముందు, రాష్ట్రంలో పలు హై-ప్రొఫైల్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ విడుదల చేసింది. మే 21న ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ ను వీక్షిస్తారు. మే 12న చారిత్రాత్మక చార్మినార్, లాడ్ బజార్ లలో హెరిటేజ్ వాక్ ఉంటుంది. మే 13న చౌమహల్లా ప్యాలెస్ ను సందర్శిస్తారు. మే 14న వరంగల్ ఫోర్ట్, వెయ్యి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించడంతో పాటు, పేరిణి నృత్య ప్రదర్శనను కూడా వీక్షించనున్నారు.
మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ విడుదల !
May 05, 2025
0
Tags