అత్యంత సంతోషకరమైన రోజు అది అంటూ నిహారిక సోషల్ మీడియాలో పోస్ట్ నెట్టింట వైరల్‌

Telugu Lo Computer
0


నిహారిక తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ''అత్యంత సంతోషకరమైన రోజు అది'' అంటూ ఓ బాబును ఎత్తుకున్న ఫొటోను నిహారిక షేర్ చేసింది. ఆ బాబుతో ఎంతో ఆనందంగా ఉన్నా ఆమె ముసిముసి నవ్వులతో కనిపించింది. అయితే ఆ బాబు ఎవరు, తనకు ఏమవుతారు అనే దానిపై ఆమె ఎటువంటి క్లారటీ ఇవ్వలేదు. దీంతో బాబు ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్‌పై ''కమిటీ కుర్రాళ్లు'' పేరుతో నిహారిక ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. గ్రామంలోని 11 మంది కుర్రాళ్లకు ,సర్పంచ్‌కు మధ్య జరిగే కథగా ''కమిటీ కుర్రాళ్లు'' తెరక్కించాడు దర్శకుడు. తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు. తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తరువాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది.విడాకుల తర్వాత నిహారిక తిరిగి తన కెరీర్ మీద ఫోకస్ పెట్టారు. నిహారిక ప్రస్తుతం హీరోయిన్‌గా రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే తన ప్రొడక్షన్‌లో సినిమాలు చేయడానికి కూడా నిహారిక సన్నద్ధం అవుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)