దెబ్బతిన్న ఇళ్లను పునర్నిర్మిస్తాం : ఒమర్‌ అబ్దుల్లా

Telugu Lo Computer
0


జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ బలగాలు జరిపిన షెల్లింగ్‌ లో ధ్వంసమైన ఇళ్లను ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పరిశీలించారు. నష్టానికి సంబంధించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న ఇళ్లను పునర్నిర్మించడానికి అవసరమైన సాయాన్ని ప్రభుత్వం తరఫు నుంచి అందిస్తామని ఈ సందర్భంగా బాధితులకు ఆయన హామీ ఇచ్చారు. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని సలామాబాద్‌, లాగామా, బందీ, గింగల్‌ సహా ఉరీలోని షెల్లింగ్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఒమర్‌ అబ్దుల్లా పర్యటించారు. ఈ ప్రాంతాల్లో వ్యక్తిగత బంకర్లను నిర్మించాలనే డిమాండ్‌ను కేంద్రంతో చర్చిస్తానని చెప్పారు. ఈ ప్రాంతంలో దెబ్బతిన్న ఇళ్లను పునర్‌నిర్మించుకోవడానికి ప్రజలకు సాయం అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఉరీ ప్రాంతంలోని ప్రజలు అనేకసార్లు బాధను భరించారని, అయితే, ప్రతిసారి ఎంతో ధైర్యంతో తిరిగి కోలుకున్నారని అబ్దుల్లా అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)