టాలెంట్‌ ఉన్న యువత కోసం 'దిల్ రాజు డ్రీమ్స్' ప్రారంభం

Telugu Lo Computer
0


కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్మాత దిల్ రాజు "దిల్ రాజు డ్రీమ్స్" అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా, యువ దర్శకులు, నటీనటులు, రచయితలు, టెక్నీషియన్లు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందనున్నారు. జూన్ నెల నుంచి యాక్టివ్ కానున్న ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో భాగం కావాలనుకునే వారు https://dilrajudreams.com/ లో తమ వివరాలను నమోదు చేయవచ్చు. నమోదు చేసుకున్న వారిని దిల్ రాజు డ్రీమ్స్ బృందం సంప్రదిస్తుంది. దిల్ రాజు, తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి, కొత్త టాలెంట్‌ను పరిచయం చేసిన చరిత్ర కలిగిన నిర్మాత. ఈ కొత్త బ్యానర్ ద్వారా కూడా ఆయన తెలుగు సినిమాకు కొత్త టాలెంట్‌ను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. సినీ రంగంలో కలలు కనే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దిల్ రాజు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)