కలబురగి ఉర్సు ఉత్సవాలకు నాంపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు !

Telugu Lo Computer
0

కర్ణాటకలోని కలబురగిలో హజరత్ ఖ్వాజా సయ్యద్ బందె నవాజ్ షరీఫ్ దర్గా ఉర్సు 621వ ఉత్సవాలు వైభవంగా ఆరంభం అయ్యాయి. ఈ నెల 14వ తేదీ నుంచి  31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. ఈ ఉర్సుకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు నాంపల్లి నుంచి ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. ఇవన్నీ కూడా అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు కావడం వల్ల సాధారణ ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటోంది. 16, 17 తేదీల్లో ఉదయం 7 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరిన నంబర్ 07178 ప్రత్యేక రైలు.. మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కలబురగికి చేరుకుంటుంది. ఇవే తేదీల్లో సాయంత్రం 6 గంటలకు కలబురగి నుంచి బయలుదేరే నంబర్ 07177 ప్రత్యేక రైలు రాత్రి 11:55 నిమిషాలకు నాంపల్లికి చేరుకుంటుంది.బేగంపేట్, సనత్ నగర్, హఫీజ్ పేట్, లింగంపల్లి, నాగలాపల్లి, శంకర్ పల్లి, గుళ్లగూడ, చిట్గిద్ద, వికారాబాద్, గోదామ్ పురా, ధర్పూర్, రుక్మాపూర్, తాండూర్, మంథట్టి, నావద్గీ, కుర్గుంట, సేడం, మల్ఖైద్ రోడ్, చిత్తాపూర్, వాడి మీదుగా రాకపోకలు సాగిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)