మీ ఆదేశాలు రాజ్యాంగం ప్రకారం ఎలా చెల్లుబాటు అవుతాయి : సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము సూటి ప్రశ్న

Telugu Lo Computer
0


రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను పరిశీలన పేరుతో గవర్నర్లు, రాష్ట్రపతి నెలల తరబడి జాప్యం చేస్తుండటంపై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వం vs గవర్నర్ కేసులో ఏప్రిల్ 8న రాష్ట్రపతి, గవర్నర్లు గడువులోగా బిల్లులు ఆమోదించాల్సిదేనని అని ఆదేశించింది. అయితే, తాజాగా అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాన్ని భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము తీవ్రంగా ఖండించారు. ఈ ఆదేశాలు రాజ్యాంగం ప్రకారం ఎలా చెల్లుబాటు అవుతాయని సుప్రీంను ప్రశ్నిస్తూ 14 ప్రశ్నలను సంధించారు. తమిళనాడు ప్రభుత్వం vs గవర్నర్ కేసులో ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు రాష్ట్ర బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని తీర్పు వెలువరించింది. గడువులోగా ఆమోదించడమో, వెనక్కి తిప్పిపంపడమో ఏదొకటి చేయాలని స్పష్టం చేసింది. బిల్లులు ఆమోదించకపోతే ఎందుకనే కారణాలు కచ్చితంగా చెప్పాలని తెలిపింది. అయితే, సుప్రీం ఇలా కాలపరిమితి విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేది లేనప్పుడు అలాంటి తీర్పు ఎలా ఇవ్వగలరని ముర్ము బుధవారం అత్యున్నత న్యాయస్థానాన్ని ప్రశ్నించారు. న్యాయమూర్తులు జేబి పార్దివాలా, ఆర్ మహదేవన్ ఇచ్చిన 415 పేజీల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)