కేంద్ర వాతావరణ శాఖ ముందుగానే జారీ చేసిన హెచ్చరిక మేరకు ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బలమైన గాలుల కారణంగా అశోక్‌నగర్ మెట్రో స్టేషన్ షెడ్ దెబ్బతింది. ఇక పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరుగుపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 గంటల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఇలాంటి వాతావరణమే నెలకొంది. హెచ్చు తగ్గులతో వాతావరణం ఉంటుంది. కొన్ని గంటలు వేడి, మరికొన్ని గంటలు చల్లగా ఉంటుంది. తాజాగా ఆకాశం మేఘావృతమైంది. దీంతో ఉష్ణోగ్రత పడిపోవడంతో నగర వాసులు చల్లని గాలులతో సేదదీరుతున్నారు.
ఢిల్లీలో ఈదురుగాలులతో భారీ వర్షం
May 17, 2025
0
Tags