జమ్మూ కాశ్మీర్‌లోని రాంభన్ జిల్లాలో ఆర్మీ జవానులతో వెళ్తున్న వాహనం లోయలో పడి ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాదాపు 700 అడుగుల లోయలో ఈ ఆర్మీ వాహనం పడిపోయింది. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఆర్మీ వాహనం లోయలో పడి ముగ్గురు జవాన్లు మృతి
May 04, 2025
0
Tags