ప్రజాపాలన కాస్త కమీషన్ల పాలనగా మారింది : కేటీఆర్ ఆగ్రహం

Telugu Lo Computer
0

ప్రజా సమస్యలను గాలికి వదిలి నోటీస్ లు ఇస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారన్నారు. ప్రజాపాలన కాస్త కమీషన్ల పాలనగా మారిందన్నారు. చట్టాల మీద విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని నోటీసులిచ్చినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదలమని అన్నారు. ఇదంతా కాంగ్రెస్‌, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని కేటీఆర్ మండిపడ్డారు. గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు నాటకాలు ఆడుతోంది. కమిషన్‌లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదు. పాలన కనిపించడం లేదు. డైరెక్ట్‌గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే “కమిషన్‌లు లేనిదే పనులు జరుగడంలేదు” అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారు.. ఈ రాష్ట్రంలో కమిషన్‌ల పాలన నడుస్తోంది - ప్రజల పాలన కాదు. ఎస్ఎల్బీసీ  టన్నెల్ కూలింది, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయింది.. మీ కమిషన్‌ల అరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి సైతం సాహసం చేయలేకపోయారన్నారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. నల్గొండలో సుంకేశల ప్రాజెక్ట్ కూలింది, ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి, ప్రజల సమస్యలపై కాకుండా పచ్చినాటకంపై దృష్టి కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొడుతున్నారు.. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి.. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు. మీరు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది.. తులం బంగారం ఏమైంది? 4 వేల రూపాయల పింఛన్లు ఏమయ్యాయి? మీరు ఎంత నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి.. మీవి అన్ని చిల్లర ప్రయత్నాలు మాత్రమే.. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించనున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)