తెలంగాణలో ఒకేసారి మూడు నెలల రేషన్ ?

Telugu Lo Computer
0


ర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా మూడు  నెలల రేషన్ ఒకేసారి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రానున్న జూన్, జులై, ఆగస్ట్ నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను అందించనున్నారు. వచ్చే వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదలు, రోడ్లు కొట్టుకోపోవడం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో ఒకేసారి పంపిణీ చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 89.96 లక్షల రేషన్ కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా, జనవరి 26 నుండి 10 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో లబ్ధిదారుల సంఖ్య 3.11 కోట్లకు పెరిగింది. ఈ కార్డుదారులకు 33 జిల్లాల్లో 365 రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ రేట్లలో సరుకులు అందించేందుకు రాష్ట్ర పౌర సరఫరా శాఖ సుమారు 22-24 లక్షల టన్నుల బియ్యం అవసరమని అంచనా వేసింది. అందుకు అనుగుణంగా 24 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి, మిల్లింగ్ ద్వారా 15-16 లక్షల టన్నుల బియ్యం సిద్ధం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)