టీవీఎస్‌ నుంచి 'కింగ్ ఈవీ మ్యాక్స్' ఈవీ త్రీవీలర్‌

Telugu Lo Computer
0


టీవీఎస్ మోటార్ కంపెనీ 'కింగ్ ఈవీ మ్యాక్స్' అనే ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ను తమిళనాడులో లాంచ్ చేసినట్లు తెలిపింది. ఈ ఈవీ త్రీవీలర్‌ ధర రూ.2.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉందని చెప్పింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 179 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని పేర్కొంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం వల్ల కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 80% ఛార్జ్‌ అవుతుంది. హై పెర్ఫార్మెన్స్ 51.2వోల్ట్‌ లిథియం-అయాన్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ. 60 కి.మీ/గం గరిష్ఠ వేగంతో మూడు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తుంది. ఎకో (40 కి.మీ/గం), సిటీ (50 కి.మీ/గం), పవర్ (60 కి.మీ/గం) వేగాన్ని కలిగి ఉంది. టీవీఎస్ స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్‌ స్మార్ట్‌ఫోన్ల ద్వారా రియల్ టైమ్ నావిగేషన్, అలర్ట్స్, వెహికల్ డయాగ్నస్టిక్స్ వివరాలు అందిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)