తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు

Telugu Lo Computer
0


బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి తగ్గి వస్తున్నాయి. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ విలువ పడిపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. ఈరోజు  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95740, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87760, ఒక కేజీ వెండి ధర రూ. 1,01,000 పలుకుతోంది. డాలర్ విలువ బలంగా ఉన్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నట్లు గమనించవచ్చు. దీనికి తోడు స్టాక్ మార్కెట్లు కూడా భారీగా లాభాల్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు నుంచి స్టాక్ మార్కెట్లో అదే విధంగా అమెరికా విడుదల చేసే ట్రెజరీ బాండ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఆసక్తి చూపిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)