విశాఖపట్నంలో స్కూటీపై వెళ్తున్న మహిళపై చెట్టు విరిగి పడిపోవడంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. విశాఖలోని సీతమ్మధార సితార అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పూర్ణిమ (38) ఈరోజు ఉదయం తన స్కూటీపై రోడ్డు మీద వెళ్తోంది. ఈ సందర్భంగా ఆమెపై చెట్టు విరిగి పడిపోయింది. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో కారు, బైక్ సహా ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
స్కూటీపై వెళ్తున్న మహిళపై చెట్టు విరిగి పడడంతో మృతి
May 05, 2025
0
Tags