నష్టాలలో స్విగ్గీ, పేటీఎం షేర్లు ?

Telugu Lo Computer
0


స్విగ్గీ షేర్లు మంగళవారం క్షీణించాయి. ఆరు నెలల లాకిన్‌ పీరియడ్‌ నేటితో ముగిసిన నేపథ్యంలో ఇవి ఒత్తిడికి గురయ్యాయి. దీంతో స్విగ్గీ షేర్లు ఇంట్రాడేలో ఏకంగా 7శాతం క్షీణించాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే స్విగ్గీ షేర్లు 5 శాతం నష్టంతో రూ.305 వద్ద ప్రారంభమయ్యాయి. లిస్టింగ్‌ తర్వాత నమోదైన రూ.617 మార్క్‌ నుంచి స్విగ్గీ క్రమంగా పతనవుతోంది. ప్రస్తుతం పోస్ట్‌ లిస్టింగ్‌ గరిష్ఠ స్థాయి నుంచి సగానికి పైగా కుంగింది. ఉదయం 10:20 గంటల సమయంలో స్విగ్గీ షేర్లు 5.40 శాతం నష్టంతో రూ.303 వద్ద ట్రేడవుతున్నాయి.  'పేటీఎం' మాతృ సంస్థ 'వన్‌ 97 కమ్యూనికేషన్స్‌' షేర్లు నేడు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో ఏకంగా 5 శాతానికి పైగా షేర్లు కుంగాయి. పేటీఎం బ్రాండ్‌పై సేవలందించే వన్‌97 కమ్యూనికేషన్స్‌లో 4% వాటాను రూ.2,066 కోట్లకు ఆర్థిక సేవల సంస్థ యాంట్‌ గ్రూప్‌ విక్రయించనుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో షేర్లపై ఒత్తిడి పెరిగింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో బ్లాక్‌ డీల్‌ ద్వారా షేర్లను విక్రయించనుందని తెలుస్తోంది. దీని ఫ్లోర్‌ ప్రైజ్‌ రూ.809.75గా నిర్ణయించినట్లు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)