పాకిస్తాన్‌ హోంమంత్రి ఇంటిని తగలబెట్టిన ఆందోళనకారులు !

Telugu Lo Computer
0


సింధూ నదీ జలాలతో విషయంలో భారత్‌ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్‌ సింధ్ ప్రావిన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. నీళ్లు లేకపోవడంతో పాక్‌ ప్రజలు ఎదురు తిరిగారు. పాక్‌ హోంమంత్రి జియా ఉల్‌ హసన్‌ ఇంటిని తగలబెట్టారు. ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీటి కటకటతో నిరసనకారులు హోమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా ఏకే 47 గన్నుతో గాల్లోకి కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సింధు నది నుండి నీటిని మళ్లించి, పంజాబ్‌కు నీటి సరఫరాను పెంచేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం కాలువను నిర్మించాలని యోచిస్తోంది. కానీ సింధ్‌లోని స్థానికులు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల తమ వ్యవసాయ భూములకు, తాగునీటికి ముప్పు వాటిల్లుతుందని,ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నామని ఈ ప్రాజెక్ట్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాభం కోసం పాకిస్తాన్‌ సైన్యం సైతం వ్యవసాయంలో భాగస్వామ్యం కావడం.. వంటి అంశాలపై పాక్‌ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. తాజాగా, ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానికులు జాతీయ రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంతో అక్కడ నిరసనలు మిన్నంటాయి. పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఆందోళనకు దారితీసింది. ఇది ఘర్షణలకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు.పోలీసు అధికారులతో సహా అనేక మంది గాయపడ్డారు. నిరసనకారులు మోరోలోని హోంమంత్రి ఇంటిపై కూడా దాడి చేసి తగలబెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)