దేశవ్యాప్తంగా మే 7న మాక్ డ్రిల్లు నిర్వహించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. వైమానిక దాడులపై అవగాహన కోసం మాక్ డ్రీల్ నిర్వహించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, శత్రు దేశాలు దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలి, ఎలా వ్యవహరించాలి, స్వీయ రక్షణపై విద్యార్థులు, పౌరులకు అవగాహన కల్పించాలి లాంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించింది. హోం శాఖ అదేశాలను బట్టి చూస్తే ఏ క్షణంలోనైనా పాక్ తో వార్ ఉండవచ్చునని తెలుస్తోంది. కాగా ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు చంపడంతో దీని వెనుక పాకిస్తాన్ ఉందని తేలడంతో దౌత్య సంబంధాలను భారత్ తెంచుకుంది.
మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్లు నిర్వహించాలని కేందం ఆదేశం
May 06, 2025
0
Tags