ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2.10 లక్షల లబ్ధిదారులు ఎంపికైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జూన్ 10 లోగా అర్హులైన మిగతా లబ్ధిదారుల లిస్టు కూడా రెడీ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 42 వేల ఇళ్లను మంజూరు చేయగా.. 24 వేల ఇళ్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. సుమారుగా 100 ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధమయ్యాయని, మిగతా ఇళ్లను కూడా అతిత్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకు 40 శాతం పేర్లను ఎంపిక చేసే అవకాశం ఇవ్వనున్నామన్న మంత్రి పొంగులేటి.. మిగిలిన 60 శాతం ఎంపిక బాధ్యతలను ఇందిరమ్మ కమిటీలకు అప్పజెప్పినట్లు చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లకు 2.10 లక్షల లబ్ధిదారులు ఎంపిక : మంత్రి పొంగులేటి
May 30, 2025
0
Tags