త్వరలో భూగ్రహం అంతం కాబోతోందని, మానవాళికి ఈ ఒక్క గ్రహం సరిపోదని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. సూర్యుడు విస్తరిస్తూ ఉన్నాడని అందువల్ల భూ గ్రహానికి పెను ముప్పు పొంచి ఉందని మస్క్ తెలిపారు. అంగారక గ్రహం భవిష్యుత్తులో మానవాళి ఉండేందుకు అనువుగా ఉందని చెప్తూ వస్తున్నారు. 2026 నాటికి అంగారక గ్రహాన్ని భాగాలుగా విభజించి, 2030 నాటికి మానవాళి అక్కడకు వెళ్లి నివాసం ఉండేందుకు పరిశోధనలు పూర్తవుతాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మార్స్ ను స్వాధీనం చేసుకోండి' అనే అంశంపై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ మార్పులతో పాటు వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం భూమి గ్రహం ఒక్కటే మానవాళికి సరిపోదు. సూర్యుడి విస్తరణ కారణంగా భూగ్రహానికి పెను ముప్పు రాబోతోంది. భూమికి ఏదైనా విపత్తు తలెత్తేలోపే ఇతర గ్రహాన్ని మానవుడు స్వాధీనం చేసుకోవడం ఉత్తమం. అంగారక గ్రహం మానవాళి నివాసానికి యోగ్యంగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి. సూర్యుడు క్రమంగా విస్తరిస్తున్నాడని, 440 మిలియన్ సంవత్సరాలకు సూర్యుడి వేడికి భూమిపై జీవం లేకుండా పోతుందని ఆయన అంచనా వేశారు. 2026 నాటికి అంగారక గ్రహంపై మానవ రహిత వ్యోమ నౌకను దించాలని, ఆ తర్వాత 2030 లోపు మానవులను పంపాలని చాలా సంవత్సరాల నుంచి మస్క్ ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల తన లక్ష్యాన్ని సవరించుకున్న ఆయన 2029 నాటికి మానవులు ఈ గ్రహంపై అడుగుపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు పరిశోధనలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. స్టార్ షిప్ వ్యోమ నౌకను అంగారక కక్ష్యలోకి పంపడం ప్రస్తుతం తమ ప్రథమ ప్రాధాన్యతలని మస్క్ స్పష్టం చేశారు.
అంగారక గ్రహంపై 2029 నాటికి మానవులు అడుగుపెట్టే అవకాశం : ఎలాన్ మస్క్
May 09, 2025
0
Tags