ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటన చేశారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా చేపడుతామని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. రైతులకు కూడా కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు జతచేసి మొత్తం రూ.14 వేలు అకౌంట్లలో వేస్తామన్నారు. రాయలసీమను హార్టికల్చర్ గా అభివృద్ధి చేస్తామన్నారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
May 17, 2025
0
Tags