12 కి.మీ కు రూ.1000 లు ఛార్జీ చేసిన ఉబర్ !

Telugu Lo Computer
0


బెంగళూరులో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా నగరంలోని ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఉబర్ ధరల పెంపు పై పోస్ట్ చేసారు. ఇందులో ఉబెర్ ఇండియా ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రశ్నించాడు ? ఈ పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో @ Marco846100 అనే అకౌంట్ ద్వారా షేర్ అయ్యింది. " @Uber_India ఒక కుటుంబం చిన్న పిల్లవాడితో వర్షంలో చిక్కుకుపోతే, మేము మీ నుండి ఆశించేది ఇదేనా ? వర్షంలో 12 కి.మీటర్లలకు మీరు ఎంత ఛార్జ్ చేస్తారు ? మానవత్వం నశించింది. బెంగళూరు ట్రాఫిక్ ఇంకా ఇప్పుడు ఈ మాఫియా." అని పోస్టులో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)