రైల్ రోకో కేసు కొట్టి వేయాలని కోరుతూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్

Telugu Lo Computer
0


తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దాఖలు చేసిన పిటిషన్ పై  హైకోర్టులో విచారణ జరిగింది. 2011 అక్టోబర్ 15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద్ లో  రైల్ రోకో చేపట్టారు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగులో ఉంది. కేసీఆర్ పిలుపు మేరకే రైల్ రోకో చేపట్టారని పీపీ కోర్టుకు తెలిపారు. రైల్ రోకో జరిగిన సమయంలో అక్కడ కేసీఆర్ లేరని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న న్యాయస్థానం రైల్ రోకో ఘటన గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)