ఆంధ్రప్రదేశ్ లో మరో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మరో విడత నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేశారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలోని సహకార బ్యాంకులైన డీసీసీబీ, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలైన డీసీఎంఎస్ ఛైర్మన్ పోస్టుల్ని భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో రాష్ట్రంలో పలు ఛైర్మన్ పోస్టుల్ని కూటమి పార్టీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. దీంతో కూటమిలో ఎప్పటి నుంచో నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి కాస్త ఊరట దక్కినట్లయింది. డీసీసీబీ ఛైర్మన్ పోస్టుల్లో శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్‍ గా శివ్వల సూర్యనారాయణ (టీడీపీ),విశాఖ డీసీసీబీ ఛైర్మన్‍గా కోన తాతారావు (జనసేన), విజయనగరం డీసీసీబీ ఛైర్మన్‍గా కిమిడి నాగార్జున (టీడీపీ), గుంటూరు డీసీసీబీ ఛైర్మన్‍గా మక్కెన మల్లికార్జునరావు (టీడీపీ), కృష్ణా డీసీసీబీ ఛైర్మన్‍గా నెట్టెం రఘురామ్ (టీడీపీ), నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్‍గా ధనుంజయరెడ్డి (టీడీపీ), చిత్తూరు డీసీసీబీ ఛైర్మన్‍గా అమాస రాజశేఖర్ రెడ్డి (టీడీపీ), అనంతపురం డీసీసీబీ ఛైర్మన్‍గా కేశవరెడ్డి (టీడీపీ), కర్నూలు డీసీసీబీ ఛైర్మన్‍గా డి.విష్ణువర్ధన్ రెడ్డి (టీడీపీ), కడప డీసీసీబీ ఛైర్మన్‍గా బి.సూర్యనారాయణరెడ్ది (టీడీపీ) కి అవకాశం ఇచ్చారు. డీసీఎంఎస్ ఛైర్మన్లుగా శ్రీకాకుళానికి అవినాష్ చౌదరి (టీడీపీ), విశాఖలో కొట్ని బాలాజీ (టీడీపీ), విజయనగరానికి గొంప కృష్ణ (టీడీపీ), గుంటూరుకు వడ్రాణం హరిబాబు (టీడీపీ), కృష్ణాకు బండి రామకృష్ణ (జనసేన), నెల్లూరుకు గొనుగోడు నాగేశ్వరరావు (టీడీపీ), చిత్తూరుకు సుబ్రమణ్యం నాయుడు (టీడీపీ), అనంతపురానికి నెట్టెం వెంకటేశ్వర్లు (టీడీపీ), కర్నూలుకు నాగేశ్వర యాదవ్ (టీడీపీ), కడప జిల్లాకు యర్లగుండ్ల జయప్రకాష్ (టీడీపీ)కి ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)