విమానం సేప్‌గా ల్యాండ్‌ చేసి గుండెపోటుతో కుప్పకూలిన పైలట్‌ !

Telugu Lo Computer
0


శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఏయిర్‌ ఇండియా విమానంలో పని చేస్తున్న ఆర్మన్‌ (28) అనే యువ పైలట్‌ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందాడు. పైలట్ చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయాణికుల ప్రాణాన్ని రక్షించి ప్రాణాలు వదిలాడు. ఆర్మన్ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన ఇతర స్టాఫ్ అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించాడు అని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అయితే ప్రయాణికుల ప్రాణాలకి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అతను విమానాన్ని ల్యాండ్ చేశాడు. ఆ తర్వాత డిస్పాచ్ ఆఫీస్ కి వెళ్లి తుది శ్వాస విడిచాడు. అంతకుముందే అతడు తీవ్రంగా వాంతులతో నీరసంగా ఉన్నాడని సహోద్యోగులు చెప్పారు. తమ కళ్ళ ముందే ఇదంతా జరగడంతో ఎయిర్ ఇండియా స్టాఫ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ కూడా తీవ్ర విచారం వ్యక్త చేసింది. ఆర్మాన్‌ అతి చిన్న ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించడంతో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి తమ సంస్థ సహకారాలు ఉంటాయని చెప్పింది.


Post a Comment

0Comments

Post a Comment (0)