శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామాలయానికి పోటెత్తిన భక్తులు !

Telugu Lo Computer
0


త్తర ప్రదేశ్ లోని అయోధ్య రామాలయానికి భక్తులు పొటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకోవడానికి క్యూలైన్ లో బారులు తీరారు. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలన్ని మారుమోగుతున్నాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దేశవాప్తంగా రామాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు రామభక్తులు. శ్రీరామనవమి పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహాత్సవాన్ని నిర్వహించడానికి ఆయా దేవాలయాల్లో భారీ ఏర్పాట్లు చేశారు నిర్వహుకులు. ఆలయ మార్గాలన్ని విద్యుత్ దీపాలతో అలకరించారు. కాషాయజెండాలతో టెంపుల్ మార్గాల్లో తోరణాలు కట్టారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)