మిర్యాలగూడలో విషాదం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన గుర్రం సీతారాంరెడ్డి మిర్యాలగూడ పట్టణంలో నివాసం ఉంటూ ఓ ఆగ్రో కెమికల్స్‌, ఫర్టిలైజర్‌ సంస్థలో సేల్స్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సీతారాంరెడ్డి, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతరు పేరు వేదశ్రీ, చిన్న కూతరు పేరు వేద సాయిశ్రీ. ఎప్పటి లాగే ఆఫీస్ పని మీద హైదరాబాద్‌ వెళ్లిన సీతారాం రెడ్డి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడే నిద్ర లేచిన పెద్ద కుమార్తె గేట్‌ తీసి అమ్మా, చెల్లి నిద్రపోతున్నారని చెప్పింది. దీంతో సీతారాం రెడ్డి తన చిన్న కూతురు వేద సాయిశ్రీని నిద్ర లేపేందుకు దుప్పటి తొలగించాడు. బెడ్‌పై గొంతు కోసి ఉన్న కూతురిని చూసి షాక్ అయ్యాడు. పక్కనే మరో గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో తలుపు పగలగొట్టి చూడగా భార్య రాజేశ్వరి ఉరేసుకుని ఉన్న స్థితిలో కనిపించింది. రక్తమడుగులో కుమార్తె, ఉరితాడుకు వేలాడుతూ ఉన్న భార్యను చూసిన సీతారాంరెడ్డి కంగుతిన్నాడు. భార్య, కూతరు మరణంతో కన్నీటిం పర్యంతమ్యాడు. వెంటనే తేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరీశీలించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు. పోలీసులు రెండు మృతదేహాలను పరిశీలించారు. రాజేశ్వరి ఎడమచేతిపై కత్తి గాయాలు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. రాజేశ్వరి తన చిన్న కూతుర్ని హత్య చేసి, తాను ఆత్మహత్యకు పాల్పడిందా? లేదా ఎవరైనాహత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరి మృతితో ఆ ఇంట్లో విషాధ చాయలు నెలకొన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)