డుకాటి స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ మోడల్ బైక్ లాంచ్

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో డుకాటి స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ మోడల్ లాంచ్ అయింది. దీని ధర రూ. 9.97 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా ఉంది. కానీ ఇంజిన్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి మార్పు లేదు. ఇందులో 803 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 73 హార్స్ పవర్, 65.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సుమారు 176 కేజీల బరువున్న ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది. స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ దాని మెయిన్ ఫ్రేమ్, సైకిల్ పార్ట్స్, ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ అన్నీ కూడా స్టాండర్డ్ మోడల్‌లో మాదిరిగానే ఉంటాయి. TFT డిస్ప్లే, రైడ్-బై-వైర్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)