ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపారు. ఈ సమయంలోనే దుండగులు ఆ రైలులోకి 10 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. దీనిపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
April 29, 2025
0
Tags