జర్మన్ తత్వవేత్త, సోషలిస్టు నేత కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని చెన్నైలో ప్రతిష్టించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ తెలిపారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ 'కార్ల్ మార్క్స్ కాలంలోనే లేబర్ ఉద్యమం ఓ శతాబ్దంపాటు సాగింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుడు పీకె మూకియా థీవర్ స్మారక భవనాన్ని మధురై జిల్లాలో నిర్మించనున్నట్లు స్టాలిన్ తెలిపారు. స్టాలిన్ అసెంబ్లీలో రూల్ 110 కింద సుమోటో ప్రకటన చేశారు. ఈ సందర్బంగా మార్క్స్ ఓ విజనరీ నేత అని, ఉద్యమకారుడని, కమ్యూనిజం ఫిలాసఫీని రూపొందించారని, ప్రపంచ కార్మికులను ఏకం చేశారని ఆయన అన్నారు. ప్రపంచ నేత కార్ల్ మార్క్స్‌కు ద్రవిడ మోడల్ ప్రభుత్వం నివాళి అర్పించనున్నట్లు స్టాలిన్ తెలిపారు.
చెన్నైలో కార్ల్ మార్క్స్ విగ్రహం !
April 03, 2025
0
Tags