ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో భార్యకు చేవి పోటు రావడంతో ఆస్పత్రిలో చికిత్స చేసుకొని ఇంటికి వస్తుండగా ఆమె చున్నీ బైక్ చక్రాల్లో ఇరుక్కోవడంతో గొంతుకు ఉరి పడడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోనసీమ జిల్లా విన్న కోటకు చెందిన మోహన్ కృష్ణ తొమ్మిది నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లా కేసనకుర్రుకు చెందిన రామదుర్గ(28)ను పెళ్లిచేసుకున్నాడు. మోహన్ కృష్ణకు అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగం రావడంతో దంపతులు సమీపంలో ఇల్లు తీసుకొని ఉంటున్నారు. రామదుర్గకు చేవిలో నొప్పి రావడంతో ఆమెను భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఇంటికి బైక్‌పై బయలు దేరారు. దారి మధ్యలో ఆమె చున్నీ బైక్ వెనుక చక్రాలలో ఇరుక్కోవడంతో మెడకు బిగుసుకుపోయింది. వాహనదారులు గమనించి వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు.
ప్రాణం తీసిన చున్నీ !
April 30, 2025
0
Tags