దేశ వ్యాప్తంగా మరోసారి డిజిటల్ చెల్లింపులకు అంతరాయం ఏర్పడింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సర్వర్ డౌన్ కావడంతో గూగుల్ పే,పేటీఎం, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ నిలిచిపోయాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే యాపుల్లో పేమెంట్స్ ఫెయిల్ కావడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాన్సక్షన్స్ జరపడంలో సమస్యలు రావడంతో గందరగోళానికి గురయ్యారు. పేమెంట్ ఫెయిల్ అయిన స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ చెక్ చేసుకుందామన్న యాప్లు పని చేయడం లేదని పోస్టుల్లో పేర్కొన్నారు. వారంలోనే యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడటం ఇది రెండోసారి. ఇటీవల యూపీఐ సేవల్లో తరుచుగా సమస్యలు తలెత్తుతుండంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్ చెల్లింపులకు అంతరాయం !
April 12, 2025
0
Tags