ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవో ఇటీవల తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని గుండు గీయించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా రూ.17 లక్షల విరాళం కూడా అన్నదానానికి ఆమె వితరణ చేశారు. ఈ నేపథ్యంలో అన్న లెజినోవా ఆమె కుమారుడుపై బీభత్సంగా ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై స్పందించిన విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం కానీ దేశం నుంచి వచ్చి పుట్టుకతోనే వేరే మతం అయినా హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అయిన అన్న లెజీనోవా గారిపై ఇలాంటి కామెంట్స్ చేయడం దురదృష్టకరం, అసమంజసం అని అన్నారు. అంతేకాదు తన కొడుకు అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డాడని విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం కోసం ఆమె కృతజ్ఞతగా తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి దర్శించుకుని తలనీలాలు సమర్పించి, అన్నదానం ట్రస్టు కూడా విరాళం ఇచ్చి సేవ కూడా చేసింది. సంప్రదాయాన్ని గౌరవించిన అన్న లెజినోవ గారికి కూడా ట్రోల్స్ చేసేవారు తప్పు అని చెప్పక తప్పడం లేదు అని ట్విట్టర్ వేదికగా విజయశాంతి రాసుకువచ్చింది.
అన్న లెజినోవా గుండుపై ట్రోల్స్ : విజయశాంతి ఖండన !
April 16, 2025
0
Tags