పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ పెంచిన కేంద్రం : వంటగ్యాస్‌ ధర రూ.50 పెంపు

Telugu Lo Computer
0


పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు రూ.2 పెంచుతూ కేంద్రం  ఉత్తర్వులు జారీ చేసింది. ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. ఎక్సైజ్ డ్యూటీ పెరుగుదల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరల్లో పెరుగుదల ఉండదని చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సమాచారం ఇచ్చినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. కాగా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం పరస్పర సుంకాల కారణంగా ట్రేడ్ వార్ వస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. దాంతో అంతర్జాతీయ ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో ఎక్సైజ్ సుంకం పెంపు చోటుచేసుకోవడం గమనార్హం. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినందున ఈ అదనపు భారాన్ని చమురు సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని తెలుస్తోంది. ఎక్సైజ్ డ్యూటీతో పాటు వంటగ్యాస్ సిలిండర్ రూ.50 మేర ధర పెరిగింది. ఈ పెంపు ఉజ్వల్ గ్యాస్ వినియోగదారులకు కూడా వర్తించనుంది. ఎల్‌పీజీ ధరలు భారత్‌లో మధ్యస్థంగానే ఉన్నాయని ఈ సందర్భంగా కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)