ఆంధ్రప్రదేశ్ లో 15 నుంచి ఇంటింటికీ 'మన మిత్ర' కార్యక్రమం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికీ 'మనమిత్ర' కార్యక్రమాన్ని ఈ నెల 15 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వాట్సప్ గవర్నెన్స్‌పై సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. ప్రతి పౌరుడి ఫోన్‌లో 95523-00009 నంబర్‌ను సచివాలయ సిబ్బంది సేవ్‌ చేయనున్నారు. జిల్లా కలెక్టర్‌కు కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. ప్రజలకు అవగాహన పెంచేలా ప్రత్యేక కరపత్రం, వీడియో సందేశాన్ని విడుదల చేసింది. తద్వారా ప్రతి ఒక్కరూ వాట్సప్‌ గవర్నెన్స్ ఉపయోగించుకునేలా ఐటీ, రియల్‌ టైం గవర్నెన్స్‌ శాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రస్తుతం వాట్సప్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 250కి పైగా సేవలందిస్తోంది. జూన్ నెలకు 500కు పైగా సేవలందించే దిశగా చర్యలు చేపట్టింది. తదుపరి దశలో 1000కిపైగా సేవల కల్పించాలన్నది ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా అధికారులు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా వాట్సప్ గవర్నెన్స్‌ను ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అందుబాటులోకి తెచ్చారు. మనమిత్ర ఇప్పటికే ప్రజాభిమానం చూరగొంటుందని అధికారులు తెలిపారు. నిరక్షరాస్యుల కోసం వాయిస్ మెసేజ్‌ ద్వారా పనిచేసేలా ఏఐ ఆధారిత చాట్‌బాట్ ఏర్పాటు చేశారు. పౌరులందరూ తమ మొబైల్ ఫోనులో మనమిత్ర పేరిట 9552300009 నంబరును సేవ్ చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)