మహా కుంభమేళాలో ఐఐటీ బాబాగా ఫేమస్ అయిన అభయ్ సింగ్ హోటల్ లో గంజాయి సేవిస్తూ దొరకడంతో జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ పై విడిచిపెట్టారు. ఐఐటీ బాబా రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఓ హోటల్లో ఉన్నాడని, ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఇవాళ మధ్యాహ్నం పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో ఆ హోటల్ కు వెళ్లి పరిశీలించగా బాబా గంజాయి మత్తులో జోగుతూ కనిపించాడు. పోలీసులు ప్రశ్నించగా గంజాయి తీసుకున్నానని ఒప్పుకున్నాడు. దాంతో పోలీసులు ఆయనను ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేశారు. అనంతరం కొద్ది మొత్తంలోనే గంజాయి సేవించాడని గుర్తించి ష్యూరిటీ తీసుకుని బెయిల్ పై విడిచిపెట్టారు. అంతకుముందు ఐఐటీ బాబా ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆయన అభిమానులు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై బాబాను ప్రశ్నించగా తాను పుట్టినరోజు సందర్భంగా హ్యాపీనెస్ కోసం గంజాయి సేవించానని, ఆత్మహత్య చేసుకుంటున్నాననే విషయాన్ని గంజాయి మత్తులోనే చెప్పి ఉంటానని చెప్పాడు. అవసరమైత ఐఐటీ బాబాను మరోసారి పిలిచి ఇంటరాగేట్ చేస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులు బెయిల్ పై విడిచిపెట్టిన అనంతరం ఐఐటీ బాబాను మీడియా ప్రశ్నించగా.. ఈ అంశంపై తాను ఇప్పుడేమీ మాట్లాడబోనని చెప్పారు. ఇవాళ తన పుట్టినరోజు అని, పుట్టినరోజు పూట తాను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఐఐటీ బాబా !
March 03, 2025
0
Tags