ముంబై ఐఐటీ క్యాంపస్ లో మొసలి హల్ చల్ !

Telugu Lo Computer
0


ముంబైలోని పొవాయ్ ఐఐటీ క్యాంపస్ లో ఓ మొసలి హల్ చల్ చేసింది. మొసలి రోడ్డు పైకి పాకుతూ రావడాన్ని గమనించిన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సెక్యూరిటీ సిబ్బంది ఈ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు చేరవేయగా హుటాహుటిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సిబ్బంది క్యాంపస్ లోకి చేరుకున్నారు. మొసలి స్థానికంగా ఉన్న పద్మావతి ఆలయంలోని సరస్సు నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. మార్చి 23, ఆదివారం సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు అటవీశాఖ సిబ్బంది పేర్కొంది. అయితే మొసలిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఫుల్ ట్రెండ్ అయింది. క్యాంపస్ లో మొసలి ప్రవేశించిన వీడియోను రాజ్ మాజీ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. " ముంబై పొవాయ్ ఐఐటీ క్యాంపస్ లోకి ఓ మొసలి ప్రవేశించింది. మొసలి క్యాంపస్ లోని రోడ్ల పై దర్జగా తిరుగుతోంది. స్థానికంగా ఉన్న పద్మావతి ఆలయంలోని సరస్సు నుంచి ఈ మొసలి దారితప్పి క్యాంపస్ లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం రాత్రి 7-8 గంటల మధ్య జరిగింది. ఇది మొదటి సారి కాదు. గతంలోనూ పొవాయ్ సరస్సు నుంచి మొసళ్లు చాలాసార్లు క్యాంపస్ రోడ్లపై తిరిగాయి. అటవీ అధికారులు ఈ ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)