తెలంగాణలో తులం బంగారం పథకం అమలుపై ఈరోజు శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత ఈ పథకం అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. మహిళలకు తులం బంగారం పథకం అమలు చేయట్లేదని స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని కవిత మండిపడ్డారు. ఈ పథకం అమలుపై భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని మంత్రి సమాధానమిచ్చారు. పెళ్లి కానున్న పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ప్రజలను నమ్మక ద్రోహానికి గురి చేసినట్లు స్పష్టమవుతుందని కవిత అన్నారు. హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచినప్పుడు అవి ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానం అని రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు.
మహిళలకు తులం బంగారం పథకం అమలు చేయట్లేదు : పొన్నం ప్రభాకర్
March 17, 2025
0
Tags