కోకాపేట్‌ జేఏఆర్ టవర్స్‌లో అగ్నిప్రమాదం !

Telugu Lo Computer
0


హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం జేఏఆర్ టవర్స్‌లోని రెస్టారెంట్‌లో సిలిండర్ పేలింది. దీంతో ఆ భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పలువురు ఉద్యోగులు.. స్థానికులు గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో కలిసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన భవనంలో పలు ఐటీ కంపెనీలు ఉన్నట్లు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)