తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై జాతీయ రహదారి పనులు చేస్తున్న వాహనాన్ని శాంట్రో కారు ఢీకొంది. కారు ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళ్తునట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన క్షతగ్రాతులను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో బాలిక మృతి చెందగా, మరొకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)