ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో బొబ్బిలి మండల పరిధిలోని పెంట జడ్పీ స్కూల్‌లో విద్యార్థులు చదువులో వెనకబడుతున్నారని ఓ హెడ్ మాస్టర్ ఆవేదనకు గురయ్యాడు. వారిని తిడితోనో, కొడితేనో విద్యార్థుల్లో మార్పు వస్తుందని ఆయన భావించ లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులను వరుస క్రమంలో నిలబెట్టి వారి ముందే ఆయన గుంజీలు తీసి ఆవేదన వెల్లగక్కారు. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ రమణ స్వయంగా ఇలా చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. విద్యార్థుల ముందే సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీసి,’మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము’ అంటూ తన బాధను వెల్లడించారు. కాగా, దండించి చదువు చెప్పే కాలం ఇది కాదని, కొడితే, తిడితే పేరెంట్స్ నుంచి ఒత్తిడి, చదువులో రిజల్ట్ రాకపోయినా వారి నుంచి, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి భరించలేకపోతున్నామనే కారణంతో ఆయన ఇలా చేసి ఉంటారని కొందరు టీచర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల ముందే గుంజీలు తీసిన హెడ్ మాస్టర్ !
March 13, 2025
0
Tags