ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ స్థిరపడేలా అభివృద్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి ప్రకటన చేశారు. విశాఖపట్టణం, తిరుపతిలో సినీ పరిశ్రమను నెలకొల్పుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త విధానం తీసుకువస్తామని తెలిపింది. శాసనమండలిలో గురువారం ఎమ్మెల్సీలు సినీ పరిశ్రమ అభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధిపై పలు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రసంగం చేశారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త విధానం తీసుకురానున్నట్లు ప్రకటించారు. సినీ ప్రముఖులతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. విశాఖపట్టణంలో సినిమా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి దుర్గేశ్ తెలిపారు. తాము అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన పెద్దలతో చర్చలు జరిపారని చెప్పారు. హైదరాబాద్‌లో తరహాలో స్టూడియోలను రాష్ట్రంలో ఏర్పాటుచేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరినట్లు మంత్రి దుర్గేశ్ వెల్లడించారు. 'ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. స్టూడియోలు నిర్మిస్తే ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని నిర్మాతలను చెప్పాం. ప్రభుత్వం ద్వారా లేక పీపీపీ మోడల్‌లో స్టూడియోల నిర్మాణానికి సహకారం అందిస్తాం' అని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. 'విశాఖపట్టణంలో రామానాయుడు స్టూడియోకు 34 ఎకరాలు కేటాయించగా వాటిని సినీ పరిశ్రమకు వినియోగించేలా చర్యలు తీసుకుంటాం' మంత్రి దుర్గేశ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త విధానం : మంత్రి కందుల దుర్గేశ్
March 21, 2025
0
Tags