మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై పునః పరిశీలించాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. గవర్నర్ ప్రసంగారినికి అసెంబ్లీలో ధన్యవాదం తీర్మానం చర్చ సందర్బంగా హరీష్ మాట్లాడారు. జగదీశ్ రెడ్డి దురుద్దేశంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. జగదీష్ ఎక్కాడా ఏక వచనంతో మాట్లాడ లేదన్నారు. స్పీకర్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు. సభా సంప్రదాయాలను పాటించాలని తమ నాయకుడు కేసీఆర్ చెబుతుంటారని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు అసెంబ్లీ, స్పీకర్ అన్నా ఎంతో గౌరవం ఉందన్నారు. జగదీష్ రెడ్డికి మైక్ ఇచ్చి ఉంటే వివరణ ఇచ్చే వారన్నారు. బంగారు తెలంగాణతో దగా చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ద్వజమెత్తారు. ప్రశ్నించే వాళ్లను పదేళ్ల పాటు తొక్కిపట్టారని అన్నారు. పదేండ్ల మీ పాలన మీ నమ్మక ద్రోహానికి చిరునామా అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పాలించారు. పదేండ్లలో ప్రాజెక్టుులు కడితే సంవత్సరం కాకముందే కూలిపోయాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కన్నీళ్లే మిగిల్చిందన్నారు.
జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై పునః పరిశీలించాలి : హరీష్ రావు
March 15, 2025
0
Tags